Winter Fest in Ramoji Film City: క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను సందర్భంగా భూతలస్వర్గం రామోజీ ఫిల్మ్‌సిటీలో సాగుతున్న "లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్" అలరిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివస్తున్న పర్యాటకులు చిత్రనగరి అందాలు వీక్షిస్తూ, కేరింతలు కొడుతున్నారు. ప్రధానంగా మూవీ మ్యాజిక్ లొకేషన్‌లో స్పేస్ యాత్ర, ఫిల్మ్‌దునియా, యాక్షన్ థియేటర్, లైట్స్ కెమెరా యాక్షన్ థియేటర్‌లోని సన్నివేశాలు ఎంతగానో అలరిస్తున్నాయి.
హైదరాబాద్‌లోనే తొలిసారిగా ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన బాన్‌ఫైర్, బార్బెక్యూ విందు సందర్శకుల మదిని దోచుకుంటున్నాయి. ఫిల్మ్‌సిటీలో 45 రోజులపాటు కొనసాగే ఈ వింటర్ ఫెస్ట్‌లో ప్రత్యేక వినోదాలను, సాయంత్రం వేళ కార్నివాల్ పరేడ్‌ను ఆబాలగోపాలం ఆద్యంతం ఆస్వాదిస్తున్నారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపాలతో అలంకరించిన ఫిల్మ్‌సిటీ గార్డెన్లు, మార్గాల మధ్య సాగే ఈ కార్నివాల్ పరేడ్‌లో పాల్గొంటూ వినువీధుల్లో విహరించిన అనుభూతిని పొందుతున్నారు.
యురేకా ప్లాజా వద్ద ప్రత్యేక ప్రదర్శనల్లో భాగంగా 'ద లయన్ కింగ్, కరేబియన్, ఈజిప్టియన్ డ్యాన్స్, యూరోపియన్ బ్యాలెట్ అండ్ సల్సా, నార్త్ అమెరికా హిప్‌హాప్, జర్నీ ఆఫ్ ఇండియన్ సినిమా' తదితర కళాకారుల నృత్యరీతులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. డ్యాన్స్ ట్రూప్, స్టిల్ట్ వాకర్స్, జగ్లర్లు, తమాషా వేషధారణల్లో అలరించే కళాకారులు, మైమరపించే సంగీతం వెరిసి సందర్శకులను ఆనందతీరాలకు చేరుస్తున్నాయి.
విద్యుత్తు దీపకాంతుల్లో వెలుగులీనే రామోజీ ఫిల్మ్‌సిటీ అందాలు నయనానందాన్ని అందిస్తున్నాయి. కిలకిలారావాల పక్షుల పార్కు, రంగురంగుల సీతాకోక చిలుకల పార్కు, బాహుబలి సినిమా చిత్రీకరణ జరిగిన మాహిష్మతి సామ్రాజ్య సెట్లు ఇలా అడుగడుగునా ఆకట్టుకొనే విశేషాలెన్నో పర్యాటకులకు మర్చిపోలేని జ్ఞాపకాలను నింపుతున్నాయి. కుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో రామోజీ ఫిల్మ్‌సిటీ వింటర్ ఫెస్ట్ సంబరాలను సరికొత్తగా ఆస్వాదించేందుకు పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిల్మ్‌సిటీలోని హోటళ్లలో బస చేసేందుకు సైతం పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రత్యేక స్టే ప్యాకేజీలను అందిస్తున్నారు.
ఇవీ చదవండి: