Winnig MLA candidates Celebrations In Telangana : ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. హోరాహోరి సాగిన పోరులో విజయం సాధించిన అభ్యర్థుల సంబరాలు అంబరాన్నంటాయి. స్పష్టమైన ఆధీక్యంతో కాంగ్రెస్ విజయ తీరాలకు దూసుకుపోతుండగానే పీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సందడి మొదలైంది. కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు వెళ్లారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గెలిచిన అభ్యర్థులు జోరుగా సంబరాలు జరుపుకున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించిన సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. అభిమానులు భారీ గజమాలతో పద్మారావును సత్కరించారు.
Telangana Assembly Elections Result 2023 : గోషామహల్‌లో మూడోసారి విజయం సాధించిన బీజేపీ నేత రాజాసింగ్ కోఠి మహిళ విశ్వవిద్యాలయం నుంచి దూల్‌పేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కోఠి కళాశాల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు జోరుగా నృత్యాలతో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు.
Telangana Assembly Elections 2023 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం జీవన్ముక్త పాండురంగ ఆలయాన్ని ఆందోల్ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆందోల్‌లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌కు ముందు గెలిచిన తర్వాత పాండురంగ ఆలయాన్ని సందర్శించటం ఆనవాయితీగా వస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతా రెడ్డి అభిమానులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని కౌంటింగ్ కేంద్రం వద్ద అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ గెలవటం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. కౌంటింగ్ కేంద్రం నుంచి గోదావరిఖని చౌరస్తా వరకు పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ, భారీ ర్యాలీ జరిపారు.
Congress Celebrations In Telangana : భూపాలపల్లి జిల్లా గండ్ర సత్యనారాయణ అభిమానులు నృత్యాలతో హోరెత్తించారు. మహబూబాబాద్‌లో మురళీనాయక్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి రెడ్డి విజయం సాధించటంతో పార్టీ శ్రేణులు జోష్‌లోకి వెళ్లాయి. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులతో జనసంద్రంగా మారింది. నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అభిమానులు నృత్యాలతో హోరెత్తించారు. తొలిసారి గెలుపొందటంపై పర్ణికా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
Bandi Sanjay Demanding Recounting In Karimnagar : కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత