ETV Bharat / state

తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు - రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభం

ఎట్టకేలకు మందుబాబుల దాహం తీరుతోంది. లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మందుకు దూరంగా ఉన్న మందుబాబులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడెప్పుడు దుకాణాలు తెరుస్తారా అని ఎదురుచూస్తూ.. ఉదయం నుంచే పడిగాపులు కాశారు. వారి కోరిక ఫలించింది షాప్ తెరుచుకుంది.

wine-shops-opened-in-telangana
తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు
author img

By

Published : May 6, 2020, 10:18 AM IST

రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రెడ్​జోన్లు సహా అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని తెలిపింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి నిరాకరిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. మద్యం ధరలు 16 శాతం పెంపు, చీప్ లిక్కర్‌పై 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలకు ఆదేశించింది. ఉల్లంఘనలకు పాల్పడితే తక్షణమే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. మాస్కు ధరించకపోతే మద్యం అమ్మవద్దని నిర్వాహకులకు సర్కారు సూచించింది. వినియోగదారులకు దుకాణాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం పేర్కొంది.

ఇవీ చూడండి: ఇక ఒక్క క్లిక్​తో ఆన్​లైన్​లో మద్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.