కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేసేంత వరకు యాత్రలు చేస్తూనే ఉంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మార్పు కోసం భాజపా చేపట్టిన చైతన్య యాత్ర మొదలై ఏడాదైన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయ నిరుద్యోగులుగా మార్చే వరకు నిద్రపోయేది లేదని తెలిపారు. కేసీఆర్ మజ్లిస్ నేతలకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం జరపట్లేదని దుయ్యబట్టారు.
తమ పార్టీ గెలిస్తే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. సచివాలయానికి రాని కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లా మీద కషాయం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
'సచివాలయానికి రాని కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకు' - state president k.lakshman
భారతీయ జనతా పార్టీ చేపట్టిన చైతన్య యాత్ర ప్రారంభించి ఏడాదైన సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్షణ్ పాల్గొన్నారు.