హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఉన్న మహావీర్ హరిణ వనస్థలి పార్కులో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇవాళ ఉదయం వాకింగ్ కోసం వచ్చిన సుబ్బారెడ్డికి ఎదురుగా దూసుకొచ్చి దాడిచేసి తీవ్ర గాయాలు చేసింది. ఎడమ చేతి చూపుడు వేలును సగం వరకు కొరికేసింది. ఈ ఘటనలో ఆయన కాలికి, చేతికి గాయాలయ్యాయి. వెంటనే సహచర వాకర్స్ బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అడవి పంది దాడితో పార్కులో అందరూ భయాందోళనలకు గురయ్యారు.
ఇవీ చూడండి: పసి ప్రాణాన్ని మింగేసిన బోరు బావి