ETV Bharat / state

అప్పుడు చెయ్యి విరగ్గొట్టాడు.. ఇప్పుడు చంపేశాడు! - హైదరాబాద్​ తాజా వార్తలు

భాగ్యనగరంలోని వెంగళరావునగర్​లో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని మృతురాలి బంధువులు తెలిపారు. నిందితుడు సంజీవ్​ మద్యం మత్తులోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది.

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
author img

By

Published : Jun 1, 2020, 4:38 PM IST

హైదరాబాద్ వెంగళరావునగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి కిరాతకంగా హతమర్చాడు. నిందితుడు సంజీవ్​ టీబీ హాస్పిటల్‌లో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. తన భార్య మృతురాలు రాణితో కలిసి కేంద్ర డ్రగ్స్‌ కంట్రోల్ కార్యాలయం సమీపంలోని నివాస ప్రాంగణాల్లో నివాసముంటున్నాడు.

కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని మృతురాలి బంధువులు తెలిపారు. సంజీవ్​ మద్యానికి బానిసయ్యాడని.. అదే మత్తులో చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. రాణిని హత్య చేసిన అనంతరం సంజీవ్​ పరారయ్యాడు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

"మొన్న రెండురోజులు ఇద్దరూ మా ఇంట్లోనే ఉండి వచ్చారు. పిల్లలు మాత్రం నా దగ్గరే ఉన్నారు. అతను తిడితే, కొట్టితే వాళ్ల ఆడపడచుల దగ్గరికి వెళ్లిందట. వాళ్లు కూడా నా బిడ్డను తిట్టి తోలొచ్చారు. ఇది వరకు ఓసారి చెయ్యి విరగొట్టాడు. నేను అతన్ని వదిలేయమని చెప్పా. అయినా నా బిడ్డ వినలే. వినకుండా చంపేదాకా తెచ్చుకుంది."

-రంగమ్మ, మృతురాలి తల్లి

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

ఇదీ చదవండి: ఎవరి బలాబలాలు ఏందో మైదానంలో తేల్చుకుందాం: రేవంత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.