అన్నదాతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రైతులకు సక్రమంగా అందేలా చూడాలని కోరారు. పెట్టుబడులు తగ్గించి రాబడులను పెంచేందుకు ప్రభుత్వాలు తగిన శ్రద్ధ కనబరచాలని హితవు పలికారు.
ఇంకా దిగుమతి ఎందుకు ?
దేశానికి సరిపడ ఆహార ఉత్పత్తి జరుగుతున్న పంటలను కూడా తిరిగి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో రైతులకు గిట్టబాటు ధరలు లభించడం లేదని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఏ విధమైన వ్యవసాయ ఉత్పత్తి అయినా... దేశీయ రైతులకు నష్టం కలగని రీతిలో ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి : హైకోర్టు తీర్పును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి: బండి సంజయ్