ETV Bharat / state

'కొత్త సెక్రటేరియట్​తో తెలంగాణ కీర్తి మరింత పెరుగుతుంది' - Central Government Latest News

దేశానికి పార్లమెంట్ భవన్ ఉండగా మరో నూతన బిల్డింగ్​ను కేంద్రం నిర్మిస్తోందని మత్స్య, పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. పాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రంలో కొత్త సచివాలయం కడుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ కీర్తి మరింత పెరిగేలా కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మిస్తామని చెప్పారు.

పార్లమెంట్ బాగలేదనే మరో భవనం కడుతున్నారా ?

author img

By

Published : Jul 7, 2020, 6:28 PM IST

పార్లమెంట్ భవన్​ ఉండగా.. కేంద్రం నూతన పార్లమెంట్ భవన్ ఎందుకు నిర్మిస్తోందని మత్స్య, పశుసంవర్థ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ప్రజలకు ఒకేచోట పరిపాలన అందాలనే ఉద్దేశంతో సూతన సచివాలయం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో పరిపాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పునరుద్ఘాటించారు.

ప్రధాని ప్రశంసలు..

రైతుబంధు సహా మిగతా పథకాలను ప్రధాని సైతం ప్రశంసించారని తలసాని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని పునరుద్ఘాటించారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. కరోనాతో రాష్ట్రంలోనే కాక ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు.

పార్లమెంట్ బాగలేదనే మరో భవనం కడుతున్నారా ?

ఇవీ చూడండి : 'మహాభారత యుద్ధం కంటే కరోనాపై పోరే క్లిష్టం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.