ఏపీ కర్నూలు జిల్లా రాయపురానికి చెందిన సుబ్రహ్మణ్యం మానసిక రుగ్మతతో సుమారు రెండు సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బంధువులు వెతికినా కనిపించలేదు. సుమారుగా రెండు సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన వైట్ డవ్స్ అనే ఆర్గనైజేషన్‌కు కాలిన గాయాలతో సుబ్రహ్మణ్యం కనిపించాడు. సంస్థ ఫౌండర్ కోరిన్నే రస్కీన్ చూసి... అతనిని మంగళూరుకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. సంవత్సరం తరువాత కోలుకున్న సుబ్రహ్మణ్యం తల్లితండ్రుల వివరాలను, ఫోన్ నెంబర్‌ను నిర్వాహకులకు వివరించాడు. వారు రోజూ ఫోన్ చేస్తూ ప్రయత్నిస్తుండగా.. ఒకరోజు వారితో రస్కీన్ మాట్లాడి సుబ్రహ్మణ్యం తమ దగ్గరే ఉన్నాడని చెప్పారు.
అదృశ్యమైన కొడుకు గురించి వెతుకుతున్న తల్లికి... సుబ్రహ్మణ్యం ఉన్నాడని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు ఇచ్చిన వివరాలతో తమ కొడుకును కలవడానికి ఆ కుటుంబ సభ్యులు మంగళూరు వెళ్లారు. సంస్థలోని మిగతా వ్యక్తుల ముందు సుబ్రహ్మణ్యంను తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. తిరిగిరాడని అనుకున్న కొడుకు తిరిగి రావడంతో.. వారి ఆనందానికి అవధులు లేవు. వైట్ డవ్స్ అనే ఆర్గనైజేషన్ అధ్యక్షుడు రస్కీన్కు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే ఈ సంస్థ ఇలాంటి ఎంతోమందిని చేరదీసి..వారి బాగోగులను చూస్తోంది. రోగులకు చికిత్సను అందిస్తూ..వారు కోలుకోగానే కుటుంబాలకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 390మందిని తమ ఇళ్లకు చేర్చి..ఎంతో మంది జీవితాల్లో వెలుగునింపింది.
ఇదీ చూడండి: గోల్ బంగ్లాకు పూర్వ వైభవం.. ఫలించిన సీపీ ప్రయత్నం