- మార్చి 7, 2020 - ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల(ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల షెడ్యూల్ జారీ
- మార్చి 9 - పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్
- మార్చి 15- ఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
- అక్టోబర్ 27 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య కమిషనర్ కాటమనేని భాస్కర్లతో ఎస్‌ఈసీ గంటల పాటు చర్చలు. కొవిడ్ విస్తృతి, తీసుకుంటోన్న చర్యలపై చర్చ.
- అక్టోబర్ 28 - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్‌ఈసీ రాజకీయ పార్టీలతో వరుస భేటీలు.. అభిప్రాయాలను సేకరించి కోర్టుకు నివేదన
- నవంబర్ 3 - ఎన్నికల కమిషన్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు అందించాలని హైకోర్టు కీలక తీర్పు
- నవంబర్ 17 - ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేసిన ఏపీఎస్ఈసీ. సన్నద్ధం కావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన
- నవంబర్ 18 - గవర్నర్‌ను కలసి పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై చర్చించిన ఏపీ ఎస్‌ఈసీ
- నవంబర్ 18 - జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓలతో వీడియోకాన్ఫరెన్స్‌కు ఏపీఎస్ఈసీ ప్రయత్నం. హాజరు కాని కలెక్టర్లు, ఎస్పీలు, డీపీఓలు
- నవంబర్ 18 - కొవిడ్ వల్ల పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని ఏపీఎస్ఈసీకి సీఎస్ లేఖ
- నవంబర్ 19 - మరోమారు వీడియో కాన్ఫరెన్స్‌కు ఏపీఎస్ఈసీ ప్రయత్నం. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లేక రెండుసార్లూ పాల్గొనని సీఎస్ సహా అధికారులు.
- నవంబర్ 23 - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి లేఖ.
- డిసెంబర్ 4 - కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అసెంబ్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మాణం.
- డిసెంబర్ 5 - ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని తప్పుపడుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
- డిసెంబర్ 18 - ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు. గవర్నర్‌ను మరోమారు కలిసిన ఎస్‌ఈసీ
- డిసెంబర్ 18 - ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు
- డిసెంబర్ 23 - పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై ఏపీ ఎన్నికల సంఘంతో... ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని పేర్కొంటూ హైకోర్టు ఆదేశం. న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత మూడు రోజుల్లో ఎన్నికల కమిషనర్ నిర్ణయించిన ప్రదేశం, సమయంలో సంప్రదింపుల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని అధికారులు హాజరుకావాలని స్పష్టం
- డిసెంబర్ 23 - తీర్పుపై ఉత్తర్వులు వెల్లడించిన ఏపీ హైకోర్టు
- 2021 జనవరి5- ఎస్‌ఈసీ నుంచి ఏపీ ప్రభుత్వానికి అందిన ఉత్తర్వులు
- జనవరి 8- ఎస్ఈసీతో సమావేశమైన సీఎస్ సహా ఉన్నతాధికారుల బృందం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఈసీకి స్పష్టం
- జనవరి 8 - పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం
- జనవరి 9 - పంచాయతీ ఎన్నికలు నిలపాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
- జనవరి 11 - ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు
- జనవరి 11 - సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లిన ఏపీఎస్ఈసీ
- జనవరి -18 - విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- జనవరి 21- ఎన్నికల నిర్వహణకు ఆదేశాలిస్తూ ఏపీ హైకోర్టు(ఉదయం 10.30 గంటలకు) తీర్పు
- జనవరి 21- ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
- జనవరి 21- తమ వాదనలు వినాలంటూ సుప్రీంలో కేవియట్ దాఖలు చేసిన ఎన్నికల సంఘం
- జనవరి -23- పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల
- జనవరి 25- ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీపై విచారణ జరిగే అవకాశం
ఇదీ చూడండి మద్దతు ధర ఇప్పిస్తారా..? రాజీనామా చేస్తారా..?: పసుపు రైతులు