కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గాయత్రి పంపుహౌస్ వద్ద 2 బాహుబలి పంపుసెట్లు ఒకేసారి పరీక్షించి 6 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రీ పంపుహౌస్‌లో రెండు పంపులను ఒకేసారి నడిపించి సాంకేతిక అవరోధాలను అధిగమించారు. నంది మేడారం పంప్ హౌస్ నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో పాటు అంతే మొత్తం నీటిని సుమారు మూడు గంటలపాటు ఎత్తిపోతలను కొనసాగించారు.
ఇవీ చూడండి: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన రాష్ట్రపతి