కాబోయే ముఖ్యమంత్రి 'కేటీఆర్'.. కూకట్‌పల్లిలో ఫ్లెక్సీల సందడి - కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ ఫ్లెక్సీలు
Next CM KTR flexies in Hyderabad : బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమైంది. ఇక ఆ పార్టీ ప్రకటనతో మంత్రి కేటీఆర్ నెక్స్ట్ సీఎం అవడం లాంఛనమైనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ నేతలంతా గొంతెత్తి చాటుతున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కేటీఆర్‌కు కాబోయే సీఎం కేటీఆర్‌కు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు స్వాగతం చెబుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ.. టీఆర్ఎస్ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు స్వాగతం అంటూ కొందరు నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. కొన్ని నెలల క్రితం ఈ తరహాలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇందుకు ముగింపు పడింది. తిరిగి మళ్లీ ఇప్పుడు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు నగరంలో సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ ఫ్లెక్సీలు కలకలం రేపాయి.
Next CM KTR flexies in Hyderabad