ETV Bharat / state

శిరోమణి... ద వెయిట్ లిఫ్టర్ - krishna

ఆమె బరిలో దిగితే ఎంతటి బరువైనా తేలికవ్వాల్సిందే. ఎలాంటి పతకమైనా చేతికి చిక్కాల్సిందే. పేదరికం వెక్కిరిస్తున్నా.. అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యం వైపు అడుగులేస్తుందామె. త్వరలో జరగబోయే కామన్​వెల్త్ క్రీడల్లో పతకమే ధ్యేయంగా శ్రమిస్తోంది.

శిరోమణి... ద వెయిట్ లిఫ్టర్
author img

By

Published : Jul 29, 2019, 5:29 PM IST

శిరోమణి... ద వెయిట్ లిఫ్టర్

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన శిరోమణి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటుతోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆమె... తండ్రిని చిన్నప్పుడే కోల్పోయింది. అప్పటినుంచి కుటుంబ భారాన్ని మోస్తూ.. లక్ష్యం వైపు సాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటుతోంది. వెయిట్​లిఫ్టింగ్​ను కెరీర్​గా ఎంచుకున్న నాటి నుంచి విజయాలతో దూసుకెళ్తోంది. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నిర్వాహకుల అండతో ఓనమాలు నేర్చి.. ఒలింపిక్స్​లో పాల్గొనే స్థాయికి ఎదిగింది.

2006లో వెయిట్​లిఫ్టింగ్​లో శిరోమణి ప్రస్థానం ప్రారంభమైంది. ప్రారంభంలో శిక్షకుడు మారెళ్ల వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్న ఆమె.. ప్రస్తుతం నాగార్జున విశ్వవిద్యాలయంలో కోచ్ అనపర్తి అమర్​నాథ్ వద్ద మెళకువలు నేర్చుకుంటోంది. ఇప్పటివరకూ రాష్ట్రస్థాయిలో 133 పతకాలు, జాతీయ స్థాయిలో 30కిపైగా పతకాలు సాధించింది. 4 అంతర్జాతీయ పోటీల్లో 3 పసిడి పతకాలు సాధించి సత్తా చాటింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరిన్ని పతకాలు సాధిస్తానంటూ ఆత్మవిశ్వాసంతో చెప్తోంది శిరోమణి.

పేదరికం కుంగదీస్తున్నా.. కుటుంబ పరిస్థితులు సహకరించకున్నా ఎంచుకున్న రంగంలో మేటిగా నిలవడమే లక్ష్యంగా కష్టపడుతోంది శిరోమణి.

ఇవీ చదవండి..

గుర్రంపై సవారీ.. చదువు చెప్పేందుకేనోయీ!

Intro:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు లోగల మల్కానగిరి జిల్లా లో రాకపోకలు నిలిచిపోయావి. జిల్లా కేంద్రం నుంచి కలిమెల, బలిమెల కు వెళ్లే మార్గాల్లో వంతెనలు మీద నుంచి 3 అడుగుల మేరకు వరద నీరు ప్రవహిస్తోంది.Body:మల్కానగిరి జిల్లా నుంచి బలిమెల చిత్రకొండ సీలేరు వెళ్లే మార్గం లో గలా కోరుకొండ వంతెన మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అలాగే మల్కానాగిరి నుంచి కలిమెల మోటు చింతూరు వెళ్లే మార్గం లో గలా kukurkondi వంతెన మీద నీరు ప్రవహిస్తుంది. Conclusion:వర్షం తగ్గుముఖం పట్టకపోవడం తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయావి. ప్రజలను ndrf సిబ్బంది లైవ్ జాకెట్స్ వేసి నీటి మీద నుండి ఆవలి కి చేరుస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.