ETV Bharat / state

'ఈసారి కూడా గతేడాది ఖరీఫ్​లాగే ఉంటుంది' - హైదరాబాద్​ తాజా వార్తలు

ఈసారి కూడా గతేడాది ఖరీఫ్‌ పంట కాలం తరహాలో ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకుపలతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు అన్నారు. రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలతో "వెబినార్ సమావేశం" నిర్వహించారు.

webinar conference on monsoon effect
'ఈసారి కూడా గతేడాది ఖరీఫ్​లగే ఉంటుంది'
author img

By

Published : May 14, 2020, 8:27 PM IST

వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న సవాళ్లల్లో రుతు పవనాలు ఒకటని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకుపలతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌ రావు అన్నారు. గత మూడేళ్ల నుంచి జర్మనీ పాట్స్‌డమ్‌ క్లైమెట్‌ ఇంపాక్ట్‌ సంస్థ... వర్షపాతానికి సంబంధించిన సమాచారం అందిస్తోందని తెలిపారు. ఈ సంస్థ శాస్త్రవేత్తలతో వెబినార్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో 350 మంది పైగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నైరుతి రుతు పవనాల రాక, వర్షపాతం, వ్యవసాయ రంగంపై ప్రభావం వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. నైరుతి రుతుపవనాలు, వర్షాల ఆధారంగా రైతులు పంటల సాగు చేయాలని ప్రవీణ్‌ రావు సూచించారు.

ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు రాకపై సర్వత్రా చర్చ సాగుతున్న తరుణంలో... జూన్ 16 నుంచి 24 వరకు వర్షాలు వస్తాయని... ఆ తర్వాత జులై 16 నుంచి అక్టోబరు 13 వరకు వర్షాలు కురుస్తాయని ఉపకులపతి ప్రవీణ్‌రావు అన్నారు. గతేడాది కూడా ఎలెనా అంచనాలు సరిపోయాయని... ఈ సారి కూడా నైరుతి రుతుపవనాలు, వర్షాల ఆధారంగా రైతులు తమ పంటల సాగుకు ఉపక్రమించాలని ఆయన సూచించారు.

'ఈసారి కూడా గతేడాది ఖరీఫ్​లగే ఉంటుంది'

'జూన్ 16 నుంచి ఈ ఏడాది వర్షాలు మొదలవుతాయని జర్మని ఇనిస్టిట్యూట్​ సమాచారం ఇస్తోంది. ఆ తర్వాత జులై 16 నుంచి అక్టోబరు 13 వరకు వర్షాలు కురుస్తాయి. ఇంకా మనకు నెల రోజులు సమయం ఉంది. ఈ కాలంలో వాతావరణ పరిస్థితులు ఏవిధంగా మారతాయి, రుతుపవనాలు ఏవిధంగా మార్పుచెందుతాయన్నది అంతుబట్టని విషయం.'

- డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌ రావు

ఇదీ చదవండి: కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.