ETV Bharat / state

చేనేత కార్మికులను చుట్టుముట్టిన కరోనా కష్టాలు - weavers problems in siricilla

నేతన్నను కరోనా కష్టాలు చుట్టుముట్టాయి. ఆరు నెలలుగా ఉపాధి లేక ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్పత్తుల విక్రయాలు నిలిచిపోయి కార్మికులకు పనికల్పించలేని దురవస్థ ఏర్పడింది. కేవలం మగ్గాన్నే నమ్ముకుని ఆధారపడ్డ వేలాది కుటుంబాలు... దిక్కుతోచక అలమటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పథకాల్ని... పకడ్బందీగా అమలు చేయాలని చేనేత సంఘాలు కోరుతున్నాయి.

Weavers problems in telangana
Weavers problems in telangana
author img

By

Published : Aug 15, 2020, 4:59 AM IST

చేనేత కార్మికులను చుట్టుముట్టిన కరోనా కష్టాలు

చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చింది. కరోనా వైరస్‌ కష్టకాలంలో ఆ పథకాలేవీ చేనేతకు చేయూతనివ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో అత్యంత ముఖ్యమైనది..... నేతన్నకు చేయూత. ప్రతి కుటుంబానికి నెలకు 15 వేలు గిట్టుబాటు కావాలన్న లక్ష్యంతో 2017 జూన్ 24న భూదాన్ పోచంపల్లిలో కేటీఆర్‌ ఆ పథకాన్ని ప్రకటించారు. ప్రతి కార్మికుడు బ్యాంకులో నెలకు 12 వందలు జమ చేస్తే... అంతకు రెట్టింపుగా 24 వందల్ని సర్కారు వేస్తుంది. ఎప్పుడంటే అప్పుడు తీసుకోకుండా... మూడేళ్ల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జూన్ కు మూడేళ్ల వ్యవధి పూర్తవుతున్నా... కరోనా వల్ల అంతకుముందుగా డబ్బుతీసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఐతే అసలు ఈ పథకం ఎంతమందికి వర్తించిందో, ఎంతమంది డబ్బులు జమ చేశారన్నది అంతుబట్టని విధంగా తయారైంది. పనిలేని కరోనా కాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని నేతన్నలు కోరుతున్నారు.

'చేనేత బంధు' తీసుకురావాలి...

నూలు రాయితీ పథకం సైతం... కార్మికులకు మేలు చేసే విధంగా ఉండేది. ముడిసరకు కోసం కేంద్రం 10 శాతం రాయితీ అందిస్తోంది. ఇందుకు మరో 40 శాతం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తోంది. వస్త్రాల తయారీలో అద్భుత నైపుణ్యాలు ప్రదర్శించే కళాకారులను ప్రోత్సహించేందుకు... ఏటా పురస్కారాన్ని అందిస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట చేనేత దినోత్సవం రోజు ఉత్తమ నైపుణ్యాలు కనబరచిన కళాకారులకు జ్ఞాపిక, శాలువా, 10 వేల నగదు అందిస్తున్నారు. ఆ నగదును 25 వేలకు పెంచుతున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. 2020కి గాను యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు..ఆ పురస్కారాల్ని అందుకున్నారు. అయితే రైతు బంధు తరహాలో... గుర్తింపు ఉన్న వారందరికీ చేనేత బంధు వంటి కార్యక్రమం అమలు చేయాలని సంఘాల నాయకులు కోరుతున్నారు.

చేనేత లక్ష్మికీ నీలినీడలు తప్పలేదు..

ప్రభుత్వ ఉద్యోగులందరూ... ప్రతి సోమవారం నేత వస్త్రాలే ధరించేలా చేనేత లక్ష్మీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సినీనటి సమంతను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కొనుగోలు చేసే వస్త్రాలకు చెందిన నగదును నెల వారీగా వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఆ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసినా... పెద్దయెత్తున వస్త్రాలు అమ్ముడయ్యేవి. కానీ ఉద్యోగులు దీనిపై ఆసక్తి చూపకపోవడం వల్ల... దీనిపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.

జియోట్యాగింగ్​తో ఇబ్బందులు...

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మరమగ్గాలకు జియోట్యాగింగ్ చేయడం... కార్మికులకు ప్రతిబంధకంగా మారింది. ఐదేళ్ల క్రితం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 27 వేల మగ్గాలుండేవి. ఒక్కో మగ్గానికి ముగ్గురు చొప్పున 81 వేల మంది కార్మికులుండేవారు. గిట్టుబాటు లేక చాలామంది ఇతర పనుల్లోకి వెళ్లారు. మగ్గం మీద వస్త్రం నేస్తున్న వారినే లెక్కల్లోకి తీసుకొని జియోట్యాగింగ్ అమలు చేస్తుండటం వల్ల... 6 వేల మందినే గుర్తించారు. వారికీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు అమలవుతాయని ప్రకటించడంతో ఇతర కార్మికులు వాటిని పొందలేకపోతున్నారు. ఇలా ప్రభుత్వ పథకాలు చెంతనే ఉన్నా... వాటి ఫలాల్ని అందుకోలేని దురవస్థలో ఉన్నాయి నేతన్నల కుటుంబాలు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.