తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దాన్ని ఆనుకుని ఉన్న మధ్య అండమాన్ సముద్ర ప్రాంతాల్లో 1.5 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఇది ఎత్తుకు వెళ్లేవరకు నైఋతి దిశకు తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.