రోడ్డు విస్తరణతో స్థలాలు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సికింద్రాబాద్లోని నార్త్ జోన్ జీహెచ్ఎమ్సీ కార్యాలయంలో స్థలాలు కోల్పోతున్న వారితో సమావేశం నిర్వహించారు. ముషీరాబాద్, కవాడిగూడ, వైస్రాయ్ హోటల్ వరకు రోడ్డు విస్తరణ గురించి చర్చించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, దీర్ఘకాలికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రహదారి నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఈ విస్తరణతో నష్టపోతున్న వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. నెల రోజుల్లో నిబంధనల ప్రకారం నష్టపరిహారం ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందా రెడ్డి, టౌన్ ప్లానింగ్ సీపీ ప్రసాద్, ఏపీసీ కృష్ణ మోహన్, ఎస్ఈ అనిల్ రాజ్, ఈఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : దయనీయంగా మారిన వృద్ధాశ్రమాల పరిస్థితి