ఆఫ్రికన్ దేశాల నుంచి భారతదేశానికొచ్చి... వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా హైదరాబాద్లో ఉంటున్నవారిపై పోలీస్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చి నగరంలో ఉంటున్న 75 మంది వీసా తదితర పత్రాలను పరిశీలించినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. వారిలో 23మంది గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్లు తేలిందని పేర్కొన్నారు. పట్టుబడిన వాళ్లను వారి వారి దేశాలకు పంపించేస్తామన్నారు. బంజారాహిల్స్, గోల్కొండ, ఆసిఫ్ నగర్, హుమాయున్ నగర్, ఉస్మానియా, అంబర్ పేట, సైఫాబాద్, చంద్రాయణ్ గుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాసం ఉంటున్న ఆఫ్రికన్ దేశస్థుల ఇళ్లపై 20 బృందాలుగా ఏర్పడిన టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామని తెలిపారు.
వీసా ముగిసిన విదేశీయులపై పోలీసులు సీరియస్
వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై వీసా చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చి నగరంలో ఉంటున్న వారి ఇళ్లలో పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.