హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద బోయల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వాల్మీకి బోయలు ధర్నా నిర్వహించారు. తమ కుల ఆరాధ్య దైవమైన మహర్షి వాల్మీకి పేరుతో రామ్ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మిస్తున్న చిత్రం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వాల్మీకి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోపీ పేర్కొన్నారు.
ఈ సినిమాకు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ సెన్సార్ బోర్డు నుంచి అనుమతి తీసుకున్నట్లు పత్రాలు చూపించడం భావ్యం కాదని గోపీ ఆరోపించారు. చిత్ర సిబ్బంది వెంటనే స్పందించి వాల్మీకి పేరును మార్చాలని, లేదంటే సెప్టెంబర్లో విడుదల కాబోయే ఈ చిత్రాన్ని తాము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి : ముట్టుకుంటే వెలిగే బల్బును చూశారా!