ETV Bharat / state

'కేసీఆర్​వన్నీ అబద్ధాలే.. వరదసాయం ఆపమని ఎప్పుడూ అనలేదు'

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో 100 స్థానాలకు పైగా సాధించి.. జీహెచ్​ఎంసీపై కాషాయ జెండా ఎగురవేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ జోస్యం చెప్పారు. వరద సహాయాన్ని భాజపా.. ఆపిందనడం కేసీఆర్‌ అబద్దాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద కేసీఆర్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

bandi sanjay
'వరద సాయం ఆపమని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదు'
author img

By

Published : Nov 18, 2020, 6:47 PM IST

Updated : Nov 18, 2020, 7:41 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారును షెడ్డుకు పంపిస్తే, సారు.. కారు.. సర్కారు.. ఇక రారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఏం జరగబోతుందో దేశం మొత్తం చూస్తోందన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో భాజపాను ప్రజలు గెలిపించారన్నారు.

భాగ్యనగరాన్ని మజ్లిస్​ చేతిలో పెడితే..

గ్రేటర్​ మేయర్​ పీఠాన్ని ఎంఐఎంకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని బండి సంజయ్​ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరాన్ని మజ్లిస్​ చేతిలో పెడితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో గ్రేటర్​ ప్రజలు ఆలోచించాలని సంజయ్​ కోరారు. తెలంగాణ కోసం ఎంఐఎం ఏనాడూ పోరాడలేదని సంజయ్​ అన్నారు. ఎన్నికల సంఘం సైతం అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని సంజయ్​ ఆరోపించారు. గ్రేటర్​ ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు గెలిచి.. జీహెచ్​ఎంసీపై కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నట్లు సంజయ్​ తెలిపారు. దుబ్బాక ఫలితాలు జీహెచ్​ఎంసీలోనూ పునరావృతమవుతాయని బండి సంజయ్​ స్పష్టం చేశారు.

భాజపా.. వరద సహాయాన్ని ఆపిందనడం కేసీఆర్‌ అబద్దాలకు నిదర్శనమని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద కేసీఆర్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌కు తాము ఫిర్యాదు చేయలేదని పేర్కొన్న బండి సంజయ్‌... సంతకాలు ఫోర్జరీ చేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని ఆరోపించారు. భాజపా నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని సంజయ్​ తెలిపారు.

'కేసీఆర్​వన్నీ అబద్దాలే.. వరదసాయం ఆపమని ఎప్పుడూ అనలేదు'

ఇవీచూడండి: 'భాగ్యనగరంపై కాషాయ జెండా ఎగరడం ఖాయం'

జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌

'సాయం'... నిన్న ఇవ్వమన్నారు.. ఇవాళ వద్దన్నారు!

Last Updated : Nov 18, 2020, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.