సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన హింసను ఖండిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హింసపై సమగ్ర దర్యాప్తుకు దిల్లీ పోలీసులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో కావాలనే కుట్రతో ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీఏఏ పేరుతో సంఘ వ్యతిరేకశక్తులు విధ్వంసానికి పాల్పడితే సహించేదిలేదన్నారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం అందరికీ ఉందన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసే పూర్తి స్వేచ్చ తెలంగాణ ప్రభుత్వానికుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 130 కోట్ల మందిలో సీఏఏ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో చెప్పాలని తెరాసకు సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. పాకిస్థా న్, బంగ్లాదేశీయుల కోసమే తెరాస సీఏఏను వ్యతిరేకిస్తుందన్నారు.