CYBER FRAUD: ‘డియర్ కస్టమర్, గత నెల కరెంట్ బిల్లు చెల్లించనందుకు ఈ రోజు రాత్రి 9.30 గంటల తర్వాత మీ కరెంట్ సరఫరా నిలిపేస్తున్నాం. ఈ నంబర్‌కు కాల్ చేయండి’ అని వస్తున్న ఫేక్ మెసేజ్‌లు విద్యుత్తు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకరరావుకూ ఇలాంటి సందేశమే వచ్చింది. అప్రమత్తమైన ఆయన దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు సీసీఎస్‌లో నమోదయ్యాయి.
కొందరు సైబర్ నేరగాళ్ల మాటలు నిజమని నమ్మి డబ్బు పోగొట్టుకున్నారు. తాము ఇలాంటి సందేశాలు పంపించమని.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: ట్రిబుల్ ఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి, కారణం అదేనా..
ఉచితాలపై భాజపా సహా అన్ని పార్టీలూ ఒకేవైపు, అందుకే మేమే తేలుస్తాం