ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి చివరి ఆయకట్టు వరకు నీరందేలా కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. కాళేశ్వరం ద్వారా కొండపోచమ్మ వరకు జలాలు వచ్చిన నేపథ్యంలో తదుపరి పనులపై దృష్టిసారించినట్లు రజత్ తెలిపారు.
కరోనా ప్రభావం వల్లే...
కరోనా ప్రభావం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ఎక్కువగా పడిందన్నారు. ఇప్పుడిప్పుడే పురోగతి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. నీటిపారుదల శాఖ ఆస్తుల గుర్తింపు ప్రక్రియ పూర్తైందని.. సుమారు 11.50 లక్షల భూములను పరిరక్షించడం సహా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటున్న రజత్తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి
ఇవీ చూడండి : బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురికి కరోనా