గుర్రంగూడ క్రాస్‌రోడ్డు వద్ద కృష్ణా తాగునీటి సరఫరా రెండో దశ పైపులైన్‌కు మరమ్మత్తులు చేస్తున్నందన హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 15 ఉదయం 6 గంటల నుంచి 16 ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తునట్లు అధికారులు తెలిపారు. వైశాలినగర్, బీఎన్ రెడ్డినగర్, ఆటోనగర్, వనస్థలిపురం, మీర్‌పేట్, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎల్లుగుట్ట, రామాంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, నాచారం, చిలుకనగర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, మేకలమండి, బోలక్‌పూర్, హంసత్‌పేట్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్,ప్రకాశ్‌నగర్, పాటిగడ్డకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. మంగళవారం పూర్తి స్థాయిలో కాకుండా కొంచెం తక్కువగానే నీటి సరఫరా చేయనున్నట్లు జలమండలి అధికారులు చెప్పారు.
ఇవీ చూడండి: 'డీ లిమిటేషన్ ప్రక్రియ మరోసారి చేపట్టాలి'