Drink Water Supply in Hyderabad: హైదరాబాద్ జంటనగరాల్లోని పలుప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌కు మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2కి సంబంధించి పటాన్‌చెరువు నుంచి హైదర్‌గూడ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ ప్రధానలైన్‌కి లీకేజీలు అరికట్టేందుకు అధికారులు మరమ్మతు పనులను చేపట్టనున్నారు. ఆర్.సి.పురంలోని లక్ష్మీ గార్డెన్ వద్ద, మదీనాగూడలోని సుమన్ కాలేజీ వద్ద జలమండలి పనులను చేపట్టనుంది.
రేపు ఉదయం 6 గంటల నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆ పనులు కొనసాగుతాయి. ఆ 24 గంటలపాటు మంజీరా వాటర్‌సప్లై స్కీమ్ ఫేజ్-2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటిసరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి తెలిపింది. బీరంగూడ, అమీన్ పూర్, ఆర్.సి.పురం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, గంగారం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, బొల్లారం, హైదర్ నగర్ పరిధిలోని ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా అంతరాయం కలగనుందని జలమండలి అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: జంటనగరాల్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు