ETV Bharat / state

శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత - karnool

ఏపీలోని శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. పండుగ వాతావరణం, సందర్శకుల కోలాహలం మధ్య ఈ గేట్లు తెరుచుకున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత
author img

By

Published : Aug 9, 2019, 6:48 PM IST

Updated : Aug 9, 2019, 10:15 PM IST

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం వల్ల శుక్రవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. ఈ సీజన్‌లో తొలిసారి కావటంతో ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి అనిల్‌కుమార్‌ నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్‌వైపు పరుగులు పెడుతోంది. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నాలుగు గేట్ల ద్వారా దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత 6వ నెంబర్‌ గేటను ఎత్తారు. తర్వాత 7, 8, 9 ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ఒక్కో గేటు నుంచి 25వేల క్యూసెక్కుల చొప్పున అధికారులు నీటిని విడుదల చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

ఎగువన భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది. మొత్తం నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 880 అడుగులు దాటింది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 189.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో నాలుగు గేట్లను ఎత్తివేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే జలాశయం నిండటం విశేషం.

ఇదీ చూడండి : లద్దాఖ్​లో జెండా ఎగరవేయనున్న ధోనీ..!

Intro:AP_TPT_31_09_varalakshmi vratham_Av_AP_10013 చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు

Body:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరింప చేశారు . ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మొక్కులు చెల్లించారు . ఆలయం తరఫున పూజా సామాగ్రిని తీర్థప్రసాదాలను వితరణగా అందజేశారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీకాళహస్తి భక్తజన సంద్రంగా మారింది.

Conclusion:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలు .ఈటీవీ భారత్ , శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.
Last Updated : Aug 9, 2019, 10:15 PM IST

For All Latest Updates

TAGGED:

karnoolgates
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.