ETV Bharat / state

యుద్ధాలు అవసరం లేదు.. ఈమూడు పాటించండి - pv narasimha Rao daughter

కరోనా కాటుకు అగ్రరాజ్యం అల్లాడుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టువదలకుండా వైద్యులు పోరాడుతున్నారు ! వారిలో ఒకరు డాక్టర్‌ విజయ సోమరాజు. ఈమె మరెవరో కాదు.. దివంగత మాజీ ప్రధాని, తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారాలపట్టి. విస్కాసన్‌ రాష్ట్రంలో రాక్‌కౌంటీ నగరంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. అమెరికాలో కొవిడ్‌ కల్లోలాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న విజయ సోమరాజు.. తన అనుభవాలను ఈనాడు వసుంధరతో పంచుకున్నారు.

Wars are not necessary follow these three in corona time
యుద్ధాలు అవసరం లేదు.. ఈమూడు పాటించండి
author img

By

Published : Apr 13, 2020, 11:26 AM IST

ఈ మహమ్మారిని గెలవాలంటే ప్రణాళిక బద్ధంగా అడుగులు వేయాలి. రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నా నేతృత్వంలో ఆస్పత్రిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశా. వైద్యనిపుణులు, కరోనా పరీక్షలు నిర్వహించేవారు అందరూ ఉంటారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతున్నాం. రోగుల సంఖ్య పెరిగితే జాగ్రత్త కోసం పాఠశాలలు, సమీపంలోని కమ్యూనిటీ హాల్స్‌లో అదనపు పడకలు ఏర్పాటు చేశాం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని రోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. మా ఆస్పత్రిలో ఇంతవరకు ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. మా ప్రాణాలు పణంగా పెట్టి వారిని కాపాడుకుంటున్నాం. రోజులో 12 గంటలకు పైగా పనిచేస్తున్నాం. నా వృత్తి ధర్మమిది.

కంగారు అవసరం లేదు..

ఈ తరహా వైరస్‌లు మనకు కొత్తవి కావు. సార్స్‌, మెర్స్‌.. వంటివన్నీ వైరస్‌లే. మనకు అనారోగ్యంగా అనిపిస్తే.. అందరికీ దూరంగా ఉండాలి. ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌ వచ్చిన కేసులూ ఇక్కడ కనిపిస్తున్నాయి. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటించడం మరచిపోవద్దు. మరో రెండు మూడు వారాల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నా. భారతదేశంలో లాక్‌డౌన్‌ కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగింది. ఈ మహమ్మారిని గెలవాలంటే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత పరిశుభ్రత, మంచి ఆహారపు అలవాట్లు, భౌతిక దూరం ఈ మూడే కరోనా కట్టడికి మార్గాలు.

డాక్టర్‌ విజయ సోమరాజుకు 23 ఏళ్ల అనుభవం ఉంది. న్యుమోనియా, ఫ్లూ వంటి వ్యాధులకు చికిత్స అందించడంలో ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించారు. ప్రస్తుతం ఇన్‌ఫెక్టియస్‌ డిసీజెస్‌-బిలాయిట్‌ హెల్త్‌ సిస్టమ్‌కు మెడికల్‌ డైరెక్టర్‌గా ఆమె సేవలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి : గల్ఫ్‌ దేశాల్లో తెలుగువారి ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.