ETV Bharat / state

AUDIO VIRAL "బండికి కట్టి లాక్కుపోతా"... కోటంరెడ్డికి బెదిరింపులు..

WARNING TO MLA KOTAMREDDY IN AP: వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డిను బెదిరిస్తున్న ఆడియో..ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో వైరల్​గా మారింది. 'పార్టీ పెద్దలను ఎదిరిస్తే.. నెల్లూరు అంగళ్ల మధ్య ఈడ్చుకుంటూ వెళ్తా'.. అంటున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇంతకీ ఆయనను బెదిరించింది ఎవరూ.. అసలు కారణం ఏంటి..!

MLA Kotam Reddy
ఎమ్మెల్యే కోటంరెడ్డి
author img

By

Published : Feb 4, 2023, 11:41 AM IST

WARNING TO MLA KOTAMREDDY SRIDHAR REDDY IN AP: ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు. ఫోన్​ ట్యాపింగ్​ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్ అయినా వైసీపీ అధిష్ఠానం.. ఆయనను వైసీపీ ఇంఛార్జ్​ పదవి నుంచి తొలిగించి ఆదాల ప్రభాకర్​రెడ్డిని నియమించింది. అయితే నిన్న నెల్లూరులో మరోమారు మీడియా సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని స్పష్టం చేశారు. ఆఖరి దాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని.. కానీ తాను అలా చేయలేదని మీడియా సాక్షిగా స్పష్టం చేశారు. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెదిరింపులు ఎదురైయ్యాయి.

నోరు జాగ్రత్త.. బండికి కట్టి లాక్కుపోతా: ముఖ్యమంత్రి జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికి వస్తే.. బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య లాక్కొని వెళ్తాను. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరం లేదు. అయిదు నిమిషాల్లో వచ్చి లాక్కొనిపోతా’ అంటూ కడపకు చెందిన బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బెదిరించాడు. దాదాపు నాలుగు దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

తనను తాను వైసీపీ మద్దతుదారుడిగా చెప్పుకొన్న అనిల్‌.. ‘నీ కథ మొత్తం నాకు తెలుసు. నీ తమ్ముడు నీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరినీ ప్రజలు తరిమికొట్టే రోజు చూడు. డేట్‌ ఫిక్స్‌ చేసుకో! నీ ఇంటికి వచ్చి కట్టుకుని పోతా’ అంటూ బెదిరించాడు.

కోటంరెడ్డిపై కేసు నమోదు: కోటంరెడ్డిపై కేసు నమోదైెంది. జిల్లాలోని పడారుపల్లికి చెందిన 22వ డివిజన్ కార్పొరేటర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. తన కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే ఫొటో తొలగించడంతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ..ఆయనతో హాని ఉందంటూ విజయ్‌భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోపాటు ఆయన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, డ్రైవర్‌ అంకయ్యలపై పోలీసులు కేసు పెట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.