సింగరేణి బొగ్గుగనుల వేలంపై లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య కాసేపు మాటలయుద్ధం జరిగింది. రాష్ట్రంలోని కల్యాణ్‌ఖని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్‌పల్లి బొగ్గు గనులను ఈ-వేలంలో చేర్చారంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వ తీరు సరైంది కాదన్న ఆయన... దీనిని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు రిజర్వ్ చేసే ప్రతిపాదన లేదని బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు రేగాయి.
ఇవీ చూడండి:
ఎన్నికల యుద్ధానికి పవన్ 'వారాహి' సిద్ధం.. ఇంతకీ దీని కథేంటో తెలుసా?
మేకిన్ ఇండియా పోయి ఊరూరా చైనా బజార్‌లొచ్చాయ్.. మోదీపై కేసీఆర్ సెటైర్స్