మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య చిత్ర ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు ఆవేశాని లోనయ్యారు. ఈ క్రమంలోనే సినిమా హాలు అద్దాలు పగలగొట్టడంతో పాటు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ థియేటర్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు చిరంజీవి నూతన సినిమా అయినా వాల్తేరు వీరయ్య రిలీజ్ సందర్భంగా.. బెనిఫిట్ షో ప్రదర్శించేందుకు.. సినిమా థియేటర్ నిర్వాకులు.. రేట్లు పెంచి టికెట్లు విక్రయించారు. అయితే సాంకేతిక లోపం కారణంగా చిత్రం ప్రదర్శించకపోవడంతో చిరంజీవి అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. థియేటర్ అద్దాలు పగలకొట్టడంతో పాటు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. అభిమానులను అక్కడ నుంచి పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం మెగా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా మేనియా కనిపిస్తోంది.సుమారు 1200 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. అన్నయ్య సినిమా తర్వాత చిరు-రవితేజ ఒకేసారి తెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఫస్టాఫ్ బాగుందని కొందరు అంటుంటే.. ఇంటర్వెల్ సీన్ ఓ రేంజ్లో ఉందని మరికొందరు అంటున్నారు.
ఇక డాన్సులు, పాటలు అన్నీ ఊరమాస్ అంటూ థియేటర్లలో చిందులేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వింటేజ్ మాస్ లుక్‌లో చిరంజీవి కనిపించడంతో అభిమానులు సైతం ఈ చిత్రాన్ని వీక్షించేందుకు భారీగా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు, తీన్ మార్ డ్యాన్స్‌లతో థియేటర్ ప్రాంగణాలు హోరెత్తుతున్నాయి. థియేటర్లలోనూ మాస్ జాతర కనిపిస్తోంది. మెగాస్టార్ స్టెప్పులు, ఇంటర్వెల్ సీక్వెన్స్, రవితేజ-చిరు కాంబో సీన్స్ టైమ్‌లో కాగితాలు ఎగురవేసి డ్యాన్సులు చేస్తున్నారు. మరోవైపు, చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత, చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో సందడి చేశారు. అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.
ఇవీ చదవండి:
రయ్.. రయ్.. 'వందే భారత్'కు సర్వం సిద్ధం.. ఇక నుంచి ఆ ఆరు రోజులు బుల్లెట్స్పీడ్తో..
'నూతన పర్యటక యుగానికి నాంది'.. 'గంగా విలాస్' నౌకను ప్రారంభించిన మోదీ