ETV Bharat / state

బంజారాహిల్స్​లో కూలిన గోడ... నిలిచిన రాకపోకలు

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బంజారాహిల్స్​లోని ఓ ప్రహారి గోడ నేలమట్టమైంది. ధ్వంసమైన శకలాలు రోడ్డుపై పడడం వల్ల తాత్కాలికంగా రాకపోకలను అధికారులు నిలిపివేశారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

wall collapsed due to rains in banjara hills
బంజారాహిల్స్​లో కూలిన గోడ... నిలిచిన రాకపోకలు
author img

By

Published : Oct 18, 2020, 3:36 PM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో ప్రహారి గోడ నేలమట్టమైంది. ధ్వంసమైన శకలాలు రహదారిని కప్పేయడం వల్ల ఆ రోడ్డుపై రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

త్వరలోనే రోడ్డుపై ఉన్న చెట్లను తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు. కూలిన గోడ ఓ సాఫ్ట్ వేర్ అధినేతకు చెందిన ఇంటి ప్రహారిగా తెలుస్తోంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.