ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముందుకొచ్చింది. రూ. 20 లక్షల నిత్యావసర వస్తువుల సరుకులతో కూడిన వాహనాలను హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్ లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీమ్ తో కలిసి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు.
100 సంవత్సరాల తర్వాత భారీ వర్షం కురవడం వల్ల నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయని హోంమంత్రి పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు తన వంతు సహాయం అందించేందుకు ముందుకు రావడాన్ని హోంమంత్రి అభినందించారు. ముంపు ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన బాధితులకు సరుకులను అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: 'దుబ్బాక స్ఫూర్తితో జీహెచ్ఎంసీలో భాజపాను గెలిపించండి'