ETV Bharat / state

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీఆర్వో.. దేహశుద్ధి చేసిన బంధువులు.!

author img

By

Published : Jan 31, 2023, 6:39 PM IST

VRO Harassed A Women : అధికారం చేతిలో ఉంది కదా అని.. కొంతమంది అధికారులు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా.. ఆ పేరుతో సాధారణ ప్రజలను వేధింపులకు గురిచేసిన ఘటనలు రాష్ట్రంలో సర్వసాధారణం అయిపోయాయి. ప్రజా సేవలో భాగంగా సక్రమంగా బాధ్యత నిర్వర్తించాల్సిన ప్రభుత్వాధికారులు.. ప్రజలకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఏపీలోని అనకాల్లి జిల్లాలో ఓ మహిళ.. ప్రభుత్వ అధికారి వేధింపులకు గురైంది. అసలేం జరిగింది.

vro
వీఆర్వో

VRO Harassed A Women: ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లా పీఎల్​పురం గ్రామానికి చెందిన వీఆర్వో ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. గ్రామానికి చెందిన దళిత మహిళ ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆమెకు సాంకేతిక కారణాల వల్ల స్థలం మంజూరు కాలేదు. దీన్ని ఆసరాగా తీసుకున్న వీఆర్వో ఆ మహిళ సెల్​ఫోన్​కు అసభ్యకరమైన మెసేజ్​లు పంపిస్తూ వేధింపులకు గురి చేశాడు.

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీఆర్వో

దీన్ని అవకాశంగా తీసుకుని గ్రామంలో పనిచేస్తున్న వీఆర్వో భాస్కర్ నాయుడు.. ఆ మహిళను తన కోరిక తీర్చాలంటూ, తనతో సహజీవనం చేయాలంటూ సెల్​ఫోన్​కు అసభ్యకరమైన మెసేజ్​లు పంపిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. దీంతో అతని వేధింపులు భరించలేక బాధిత మహిళ బంధువులకు తెలియజేయడంతో పంచాయతీకి పిలిపించి వీఆర్వో ను నిలదీసి దేహశుద్ధి చేశారు. అనంతరం జరిగిన ఈ పూర్తి విషయాలను పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.