'ముఖ్యమంత్రి మేల్కొని ప్రజల ప్రాణాలను కాపాడు.. బతుకుదెరువు నిలబెట్టు' అనే నినాదంతో ఈ నెల 7న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. కరోనా కోరల్లోంచి ప్రజలను రక్షించాలనే డిమాండ్‌తో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో 'వర్చువల్ రచ్చబండ' నిర్వహించారు. వర్చువల్ రచ్చబండ సభలో తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, న్యూడెమోక్రసీ నాయకుడు కె.గోవర్దన్, చెరుకు సుధాకర్, పాల్గొని ప్రసంగించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 హామీ ఇచ్చిన జీవించే హక్కు సాధించుకోవడం కోసం జరిగే ఈ నిరసనలో ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే నల్ల బెలూన్లను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రికి చేరేదాకా ఈ కార్యాచరణకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఈ వర్చువల్ రచ్చబండలో వేలసంఖ్యలో అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆరు ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తాం: ఈటల