Vinod Kumar Comments on PM Modi Speech : తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అర్థమైందని.. అందుకే వరంగల్ వేదికగా ఒక్క కొత్త ప్రకటన కూడా చేయలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వెళ్లి రూ.వేల కోట్ల హామీలు ఇచ్చే ప్రధాని.. వరంగల్ వేదికగా ఒక్క ప్రకటన కూడా చేయకుండా రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచారని ఆయన ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్ పైన మోదీ వ్యాఖ్యలను వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బీజేపీయేతర ప్రభుత్వాలను అవినీతి అని పదే పదే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
Vinod Kumar Fire on PM Modi : కర్ణాటకలో బీజేపీ పార్టీ ఎందుకు ఓటమి పాలైందో తెలియదా అని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారని ప్రధాని అంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చేసేందుకు.. నియామక బిల్లును ఆపింది బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ కాదా అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు కావాలని గొంతు చించుకున్నా స్పందించలేదని ధ్వజమెత్తారు. విద్యా విధానాన్ని ధ్వంసం చేసింది ఎవరు అని వినోద్ ప్రశ్నించారు.
Kajipet Wagon Factory : కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఎలా ఉంటుందంటే..
Vinod Kumar Latest Comments : పనులు జరుగుతున్న జాతీయ రహదారులకు ప్రధాని శంకుస్థాపన చేశారు తప్ప.. కొత్త జాతీయ రహదార్ల కోసం పెండింగ్లో ఉన్న వాటిపై స్పందించలేదని వినోద్ కుమార్ మండిపడ్డారు. మోదీవి అన్నీ కాపీ కొట్టుడే అన్న ఆయన.. తాము అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఆయన అబ్ కీ బార్ బీజేపీ సర్కార్ అన్నారని ఎద్దేవా చేశారు. ఇపుడు దేశంలో బీజేపీ ప్రభుత్వం లేదా? అని వినోద్ నిలదీశారు.
"ప్రధాని మోదీ వరంగల్లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కుటుంబ పాలన అని చెప్పి.. ఎక్కడకి వెళ్లినా అదే విమర్శిస్తున్నారు. బీజేపీ పార్లమెంట్ సభ్యుల్లో ఎక్కువ మంది వ్యక్తుల్లో బీజేపీకి సంబంధించిన కుటుంబాలకే టికెట్లు ఇచ్చారు. మోదీ బీజేపీయేతర రాష్ట్రాలకి వెళ్తే .. ఆ రాష్ట్రానిది అవినీతి పాలనని వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ అవినీతి వల్లే ఓడిపోయింది. యూనివర్సిటీలు ధ్వంసం అయ్యాయని మోదీ అన్నారు. దానికి కారణం వారు నియమించిన గవర్నర్ కాదా? తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా మోదీ ప్రకటించలేదు. నేను రాష్ట్రానికి ఏదైనా ప్రకటిస్తారని అనుకున్నాను. రాష్ట్రంలో బీజేపీ గెలవదనే ఏ హామీలు ఇవ్వలేదు. పనులు ప్రారంభం అయిన రహదారిక శంకుస్థాపన చేశారు."- వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
ఇవీ చదవండి :