Villa Marie Students Science Exhibition In Hyderabad : హైదరాబాద్ సోమాజిగూడలోని విల్లామేరీ ఇంటర్ సైన్స్ విద్యార్థులతో పాటు నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులచే బ్రిలియంట్ బ్రెయిన్స్ పేరుతో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విభిన్న రకాలైన ఆవిష్కరణలు చేసి ఔరా అనిపించారు. చంద్రయాన్, మానవుని జీవిత చరిత్ర, సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనారోగ్యానికి గల కారణాలు ఇలా పలు అంశాలను విద్యార్థులు ప్రదర్శించిన తీరు వీక్షకులను ఆశ్చర్యచకితులను చేశాయి.
Students Science Exhibition In Hyderabad : విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. స్టూడెంట్స్.. అందరిలో బిడియం లేకుండా ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయవచ్చని.. విల్లామేరీ విద్యార్థులతో పాటు నగరంలోని పాఠశాలకు చెందిన విద్యార్థులు పలు అంశాలను చక్కగా ప్రదర్శించారని విల్లామేరీ కళాశాల ఉపాధ్యాయురాలు అమిత అన్నారు.
ఆకట్టుకున్న ప్రభుత్వ పాఠశాల వైజ్ఞానిక ప్రదర్శన
"ఇంటర్మీడియట్ సైన్స్, మ్యాథ్స్ విద్యార్థులతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఇందులో వివిధ పాఠశాలల నుంచి పదో తరగతి సూడెంట్స్ కూడా పాల్గొన్నారు. వారంతా చాలా రకాల ప్రదర్శనలు తమ వెంట తీసుకువచ్చారు. ప్రయోగానికి సంబంధించిన అంశాలను విద్యార్థులు చాలా చాలా సమర్థవంతంగా ప్రదర్శించారు." - అమిత, విల్లామేరీ కళాశాల సైన్స్ ఉపాధ్యాయురాలు
Chandrayaan Model experiment : విద్యార్థులు చంద్రయాన్ నమూనా, దాని పనితీరు ఎలా ఉంటుంది.. చంద్రునిపై దిగిన తర్వాత ఇప్పుడు ఏమి చేస్తుంది అనే అంశాలను తోటి విద్యార్థులకు వివరిస్తున్నారు. మనిషి శరీరంలోని నరాలు ఏవిధంగా పని చేస్తున్నాయి.. మెదడుకు రక్త సరఫరా ఎలా జరుగుతుంది. చాక్లెట్ ద్వారా విద్యార్థులకు డ్రగ్స్ ఏవిధంగా చేస్తున్నారు. పాస్ట్‌ఫుడ్‌కు, సేంద్రియ ఆహార ఉత్పత్తులకు ఉన్న తేడాలు, సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో విద్యార్థులు చక్కగా వివరిస్తున్నారు.
రమాదేవి పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఎక్స్ప్లోరా వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకున్న విద్యార్థులు
"మేము రిమోట్ సహాయంతో నడిచే షిప్ను తయారు చేశాము. ఇది చాలా సమర్థవంతంగా నీటిలో నడుస్తుంది. నీటిలో ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తుంది." - విద్యార్థిని
"కార్డ్బోర్డ్, పేపర్ సహాయంతో రాకెట్ నమూనా తయారుచేశాం. చంద్రుని ఉపరితలంపై తేలికగా, సున్నితంగా దిగడానికి విక్రమ్ ల్యాండర్ ఎలా పనిచేస్తుందో తెలుపుంది." -మరో విద్యార్థి
Students Science Exhibition In Somajiguda : ఈ ప్రదర్శనలో నీటి మార్గంలోనూ, రోడ్డు మార్గంలో ప్రయాణం చేసే షిప్ అందరిని ఆకట్టుకుంది. విద్యార్థులను కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా.. వారిలో ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పటు చేసినట్లు కళాశాల నిర్వహకులు తెలిపారు. విద్యార్థులను కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా.. వారిలో ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పటు చేసినట్లు కళాశాల నిర్వహకులు తెలిపారు.