ETV Bharat / state

విజయవాడ గ్యాంగ్ వార్​: వెలుగులోకి కీలక అంశాలు - విజయవాడ వార్తలు

ఏపీలోని విజయవాడ గ్యాంగ్ వార్‌లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోట సందీప్, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతో పాటు వ్యక్తిగత పోరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

vijayawada-gang-war
విజయవాడ గ్యాంగ్ వార్​: వెలుగులోకి కీలక అంశాలు
author img

By

Published : Jun 2, 2020, 9:14 PM IST

ఆంధ్రప్రదేశ్​ విజయవాడలో సంచలనం రేపిన పటమట గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి జరగటానికి ముందు రోజు మణికంఠ అలియాస్ కేటియం పండు టిక్​టాక్​ చేశాడని.. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

కొంతకాలంగా తోట సందీప్, మణికంఠ అలియాస్ కేటియం పండు ముఠాల మధ్య ఆర్ధిక లావాదేవీలతో పాటు ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్నాళ్లు ఇద్దరూ కలిసే సెటిల్ మెంట్స్ చేసేవారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వివాదాస్పద భూముల్లో ఈ రెండు వర్గాల జోక్యం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒక ప్రాంతంలో సెటిల్ మెంట్ చేయాలంటే వేరే ప్రాంతంలో ఉన్నవారిని తీసుకువెళతారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సందీప్, పండుల టిక్ టాక్, ఫేస్ బుక్ అకౌంట్లలో ఉన్న కొందరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ గ్యాంగ్ వార్​: వెలుగులోకి కీలక అంశాలు

ఇదీచూడండి: సీపీఐ మావోయిస్టు దళ సభ్యుడు అరెస్ట్...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.