లాక్డౌన్ పక్కాగా అమలు చేయడంలో పోలీసులు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను బయటికి రానీయకుండా నియంత్రిస్తూ తమ వంతు భూమిక నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానా విధిస్తున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 8 లక్షలకు పైగా వాహనాలకు జరిమానా విధించారు. 80 వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల క్షేత్రస్థాయి విధులను ప్రతిబింబించేలా రూపొందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్తో పాటు... ఇతర ఉన్నతాధికారుల దృశ్యాలు, సందేశాన్ని చిత్రీకరించి వీడియో రూపొందించారు.
ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!