ETV Bharat / state

ఫేస్​బుక్​ పరిచయంతో పెళ్లి.. రెండు నెలలకే మరో వివాహం

ఫేస్​బుక్​లో పరిచయం అయ్యాడు. నువ్వు లేకపోతే బతకలేనని నమ్మ బలికాడు. కాదంటే.. స్నేహితులతో మాట్లాడించి ఒప్పించాడు. ఆ మాయమాటలకు కరిగిపోయి కనికరించింది. అతను మాత్రం రెండు నెలలకే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్​కి వెళితే.. న్యాయం అతడివైపే కొమ్ముగాసింది. చివరికి.. మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.

ఫేస్​బుక్​ పరిచయంతో పెళ్లి... రెండునెలలకే మరో వివాహం

author img

By

Published : Jul 16, 2020, 8:07 PM IST

హైదరాబాద్​లోని రాంనగర్​కు చెందిన యువతికి.. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా తిమ్మాపురానికి చెందిన కాశి ఫేస్​బుక్​లో పరిచయం అయ్యాడు. కొద్దిరోజుల తర్వాత ప్రేమించాలని వేధించాడు. యువతి వద్దని వారిస్తే.. స్నేహితులతో మాట్లాడించాడు. కాశి ఎంతో ఇష్ట పడుతున్నాడని, అతనిది నిజమైన ప్రేమని.. ఎవేవో మాయమాటలు చెప్పేశారు.

ఓవైపు కాశి, మరో వైపు స్నేహితులు అందరి మాటలతో ఆమె ఆలోచనల్లో పడింది. ప్రేమ నిజమేనని నమ్మింది. ఓ మనసు పడ్డ ముహుర్తాన ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. అందరినీ ఒప్పించి.. మళ్లీ ఘనంగా పెళ్లి చేసుకుందామని చెప్పాడు.

రెండు నెలలలో అతనికి మొహం మొత్తేసింది. అతనిలో అసలైన మనిషి బయటికొచ్చాడు. చెప్పా పెట్టకుండా మరో పెళ్లి చేసేసుకున్నాడు. ప్రేమని అక్కడ, ఇక్కడ చెరో సగం పంచేస్తున్నాడు.

కొద్దిరోజుల తర్వాత డబ్బులు కావాలని వేధించడం ప్రారంభించాడు. కట్నం కింద రూ.10 లక్షలు తేవాలని ఒత్తిడి తెచ్చాడు. అంత ఇవ్వలేనని, ఎంతోకొంత ఇస్తానని చెప్పింది. అప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించాడు.

ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని గమనించిన యువతి.. ఓ రోజు కాశి వాళ్ల ఇంటికి ఫోన్ చేసింది. అప్పడు ఆమెకు అసలు విషయం తెలిసింది. తన కొడుక్కి పెళ్లి అయిపోయిందని, ఇక అతడిని ఇబ్బంది పెట్టొద్దని కాశి వాళ్ల అమ్మ చెప్పడం వల్ల గుండె పగిలినంత పనైంది.

ఫేస్​బుక్​ పరిచయంతో పెళ్లి... రెండునెలలకే మరో వివాహం

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ప్రకాశం జిల్లా దోర్నాల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేదు. అతని పలుకుబడి ముందు.. న్యాయం ఓడిపోయింది. యువతిదే తప్పని ఓ నిర్ణయానికి వచ్చేశారు.

సామాజిక మాధ్యమాల్లో నమ్మించి, వంచిచిస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అటువంటి వారిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు అమాయకులు బలవుతూనే ఉన్నారు. ఆన్​లైన్ బంధాల్లో ఎక్కువశాతం చివరికి మోసమేనని తేలుతోంది!

ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.