రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌ను ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్‌రావు మర్యాద పూర్వకంగా కలిశారు. వర్సిటీకి ఛాన్సలర్ అయిన గవర్నర్‌కు విశ్వవిద్యాలయం స్థాపించిన నాటి నుంచి సాధించిన ప్రగతిని వివరించారు. అంతర్జాతీయ సంస్థలతో వర్సిటీ కుదుర్చుకున్న ఒప్పందాలను తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు కావటంలో వ్యవసాయ వర్సిటీ పాత్ర గురించి ఆయన గవర్నర్‌కు తెలియజేశారు. అక్టోబర్‌లో జరగనున్న రీజినల్ వర్క్‌షాప్ ఆన్ యూత్ యాజ్ ఏ టార్చ్ బేరర్స్ ఫర్ బిజినెస్ ఓరియెంటెడ్ అగ్రికల్చర్ సదస్సుకు గవర్నర్‌ను ఆహ్వానించారు.
ఇవీచూడండి: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు