ETV Bharat / state

సాంస్కృతిక కార్యక్రమాలు వయా.. సోషల్ మీడియా.. - రాష్ట్రంలోని సాంస్కృతిక కార్యక్రమాలు

సంగీత, సాహిత్య, నృత్యాల ద్వారా ప్రజలను చైతన్యం చేసే.. సాంస్కృతిక కార్యక్రమాలపై కరోనా పెను ప్రభావం చూపిస్తోంది. మారుతున్న కాలానికి అనుకూలంగా.. కార్యక్రమాలు కూడా టెక్నాలజీలోకి రూపాంతరం చెందుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

Via cultural events .. social media
సాంస్కృతిక కార్యక్రమాలు వయా.. సోషల్ మీడియా..
author img

By

Published : May 22, 2020, 8:57 PM IST

రాష్ట్రంలోని సాంస్కృతిక కార్యక్రమాలపై కరోనా ప్రభావం పడింది. నిత్యం కళాకారులు, కళాప్రదర్శనలతో కళకళలాడే ప్రాంగణాలు వెలవెల బోతున్నాయి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే ఈ కార్యక్రమాలు.. తన వేదికను మార్చుకున్నాయి.

సామాజిక మాధ్యమాల ద్వారా...

సాంస్కృతిక కార్యక్రమాలను నేరుగా జన బహుళ్యంలో వీక్షించే ప్రజలు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ తన వేదికను సంప్రదాయ విధానం నుంచి డిజిటల్‌ విధానంలోకి మార్చుకుందన్నారు.

అందుకు అనుగుణంగానే ట్రాన్స్‌ఫర్‌ ట్రెడిషన్‌, ట్రాన్స్‌ఫర్‌ మోడ్రన్‌, ట్రాన్స్‌ఫర్‌ టెక్నాలజీ విధానం ద్వారా ప్రజల ముందుకు రానున్నట్లు చెప్పారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ.. పలు కార్యక్రమాలు డిజిటల్‌ విధానంలో రూపొందించినట్లు పేర్కొన్నారు.

త్వరలో యువ నాటకోత్సవాలు

సామాజిక మాద్యమాల ద్వారా ఇప్పటికే సంగీత, నాటక, నృత్య వంటి పలు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించినట్లు వెల్లడించారు. త్వరలోనే 10 రోజుల పాటు యువ నాటకోత్సవాలను సైతం మీడియా ద్వారా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.