ఏఐసీసీ ఆదేశాల మేరకు వలస కార్మికుల కోసం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విధంగానే రాష్ట్రంలోని పేద ప్రజల కోసం కొవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, వి.హనుమంత రావు కోరారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ రాశారు. పీసీసీ కమిటీ నాయకులకు కంట్రోల్ రూమ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలన్నారు.
కరోనా విషయమై ఎవరు ఫోన్ చేసినా వివరాలు అందించేందుకు వీలుగా అన్ని వివరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. కరోనా చికిత్స అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వివరాలు, వైద్యుల పేర్లు, వారి ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకుని ఫోన్ చేసిన రోగికి తెలపాలన్నారు. రోగి పేరు వారితోపాటు ఉండే మనిషి సెల్ నంబరు ఇలా అన్ని వివరాలు తీసుకోవాలన్నారు. ఆ తరువాత ఆ రోగి చేరిన ఆస్పత్రికి ఫోన్ చేసి చికిత్స ఏలా అందుతుందో తెలుసుకోవాల్సి ఉందని, కాంగ్రెస్ ఆఫీసు నుంచి ఫోన్‌కాల్ వెళ్తే ఆస్పత్రుల యాజమాన్యాలు స్పందించే తీరు వేరుగా ఉంటుందన్నారు.
ఇదీ చూడండి:కేంద్రం 'దిగుమతి' నిర్ణయం.. మొక్కజొన్న రైతులకు శరాఘాతం