ఏఐసీసీ కార్యదర్శి పదవికి వి.హనుమంతరావు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు పంపించినట్లు వీహెచ్ వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఒక్కరే బాధ్యత తీసుకోవద్దన్నారు. సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలకు బాధ్యత ఉంటుందని అయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చినందునే తెలంగాణలో పార్టీ ఓటమికి ఒక కారణమన్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో ఉంటేనే భవిష్కత్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక నుంచైనా పార్టీ సినీయర్ నేతలకు కూడా సమయం కేటాయించి పార్టీ అభివృద్దిపై వారి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు.
ఇవీ చూడండి: ' సుమారు 3నెలల్లో పూర్తి స్థాయి ఫీజులు ఖరారుచేస్తాం'