ఖమ్మం నుంచి పోటీచేస్తా..! వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీకి సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రకటించారు. అధిష్ఠానం టికెట్ ఇస్తే ఖమ్మం ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి గురించి మాట్లాడిన ప్రధానికి... తెలంగాణలో అవినీతితో పాటు కుటుంబపాలన ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థంకావడంలేదని దుయ్యబట్టారు.