ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పర్యటనలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో లేదని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు విమర్శించారు. హాజీపూర్‌లో అమాయకపు అమ్మాయిలపై హత్యాచారం చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోవడం లేదని హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆరోపించారు. బాధితులను పరామర్శించే తీరిక కూడా ఈ సీఎంకు లేదని ఎద్దేవా చేశారు. తన పార్టీ కార్యకర్త చనిపోతే అతని పాడె మోసిన స్మృతి ఇరానీని చూసి బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. వెంటనే హాజీపూర్ బాధితులను ఆదుకోకపోతే తాను మరోసారి ఆ గ్రామానికి వెళ్లి దీక్ష చేస్తానని హెచ్చరించారు.
ఇదీ చూడండి : 'ఓటమికి బాధ్యుల్లో ఆ ముగ్గురే కీలకం'