మున్సిపల్ ఎన్నికల ఓట్ల కోసం భాజపా, మజ్లిస్ నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు రెచ్చగొట్టేలా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు తప్పుపట్టారు. పార్లమెంట్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఓటేయించిన కేసీఆర్ అదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. నిరసన తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడితే భాజపా నేతలు దేశద్రోహం అంటున్నారని ఆయన ఆక్షేపించారు. భాజపా భారత దేశాన్ని హిందూదేశం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చినట్లే ముస్లింలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేఏన్‌యూలో అశీస్ ఘోస్‌పై ఆర్‌ఎస్‌ఎస్ దాడి చేస్తే ఆమె పైననే కేసులు పెట్టారని వీహెచ్ విమర్శించారు.
ఇవీచూడండి: యావత్ దేశానికే ఆదర్శంగా మున్సిపాలిటీ చట్టం