తమ నాయకురాలిపై సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తుంటే క్రమశిక్షణ కమిటీ, సీఎల్పీ నేత భట్టి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎందుకు నోరు విప్పడంలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికి వారు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోసారి ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యతలు తీసుకోవడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నవారు ఎవరో తేల్చాలన్నారు. ఉత్తమ్, భట్టి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒక ఎంపీ గాంధీ కుటుంబంపై సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాయిస్తూ తనకు తెలియదంటున్నారని... అతని మీద విచారణ జరగాలని లేదంటే.. తానే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,579 కరోనా కేసులు నమోదు