రాష్ట్ర ప్రభుత్వం రవాణా, రిజిష్ట్రేషన్ శాఖలతో పాటు నిర్మాణ రంగానికి వెసులుబాటు కల్పించింది. నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు, ఎలక్ట్రికల్, ప్లంబర్, సిమెంట్, స్టీల్ దుకాణాలు తెరవడం వల్ల వాటిలో పనిచేసే వారితో పాటు వ్యాపారులు బయటకు వస్తున్నారు. ఐటీ ఉద్యోగులు 33శాతం కార్యాలయాలకు వెళ్తుండటం వల్ల భాగ్యనగరంలో వాహనాల రాకపోకలు పెరిగాయి.
సాధారణ రోజులతో పోలిస్తే 35 శాతం వాహనాలు రహదారులపై తిరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పోలీసులు మాత్రం వెసులు బాటు కల్పించిన రంగాలకు చెందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు.