రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేసవిలో కార్లు బయటకు తీసినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మంటలు చెలరేగి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీనియర్ మెకానిక్ విద్యాసాగర్‌తో ముఖాముఖి..
ప్ర. వేసవిలో కార్లలోని నుంచి మంటలు ఎందుకు వస్తాయి?
జ. బానెట్‌లో కూలెంట్ అనేది చాలా ప్రధానమైనది. కూలెంట్ కారులో ఉన్నప్పుడు ఇంజిన్ చల్లగా ఉంటుంది. అది లేకుంటే ఇంజిన్ వేడిగా అయి రాపిడి ఎక్కువై మంటలు చెలరేగే అవకాశముంటుంది.
ప్ర. కార్లలో షార్ట్‌సర్క్యూట్ ఎందుకు అవుతుంది?
జ. బండిలోపలికి ఎలుకలు వెళ్లి వైర్లను కొరికే అవకాశముంది. వైర్లు తెగిపోయి కారు బాడీకి తాకి పొగలు వస్తాయి. గమనించుకోకపోతే కారు తగలబడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాన్ మోటర్‌కి రిలే ఉంటుంది. లక్ష కిలోమీటర్లు తిరిగినాక దానిని కచ్చితంగా మార్చుకోవాలి. బండి తిరుగుతుంది కదా అని మార్చుకోకపోతే మంటలు వచ్చే ప్రమాదం ఉంది. లక్ష తిరిగాక కచ్చితంగా మార్చుకుంటే ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగవు.
ప్ర. దూరప్రాంతాలకు ప్రయాణించే వారు ఎంత సమయానికి వాహనానికి విశ్రాంతి ఇవ్వాలి?
జ. దూరప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కారుకి కచ్చితంగా విశ్రాంతి ఇవ్వాలి. కనీసం పది నిముషాలైనా ఇంజిన్‌ను నిలిపివేయాలి.
ప్ర. వేసవి కాలంలో వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ. బానెట్‌లో ఇంజిన్ ఆయిల్, కూలెట్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వైర్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తరచూ వీటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ తరువాతే బయటకు వెళ్లాలి.
ఇవీ చూడండి: హైదరాబాద్ నుంచి అమరావతికి బయల్దేరిన చంద్రబాబు