ETV Bharat / state

Vegetables Price in Telangana : కూర'గాయాలు'.. ఇవే పరిష్కార మార్గాలు..! - హైదరాబాద్ తాజా వార్తలు

Vegetables Price Increased in Telangana : రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశానంటున్నాయి. టమాటాలు అయితే సెంచరీ కొట్టేయగా.. ఇతర కూరగాయలు కూడా అదే బాటలో దూసుకెళ్తున్నాయి. దీంతో ధరలు ఎప్పుడు తగ్గుతాయోనని వినియోగదారులు ఆశగా చూస్తున్నారు.

Vegetables Price in Telangana
Vegetables Price in Telangana
author img

By

Published : Jul 4, 2023, 10:25 AM IST

మండుతున్న కూరగాయల ధరలు.. కొనలేం.. తినలేం..!

Vegetables Price Hike in Telangana : రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రజలు అవసరాలకు అనుగుణంగా వీటిని సాగు చేయకపోవడం, తగినంతగా ఉత్పత్తులు రాకపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కూరగాయల కొరతను నివారించడానికి గతంలో ప్రతిపాదించిన పంట కాలనీల ఏర్పాటు ఓ పరిష్కార మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు. ఏటా రాష్ట్ర జనాభాకు 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా.. 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో మిగతా అవసరాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

Vegetables Price Increased in Telangana : తెలంగాణలో మొత్తంగా 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. అందులో కూరగాయల సాగు కేవలం 3.11 లక్షల ఎకరాలకే పరిమితమైంది. కూరగాయల కొరతను గమనించిన ప్రభుత్వం.. ఉత్పత్తిని పెద్దఎత్తున పెంచే లక్ష్యంతో.. రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల పంట కాలనీలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, పట్టణాలకు చుట్టుపక్కల 20-30 కిలోమీటర్ల పరిధిలో సాగుకు దీన్ని ఉద్దేశించారు. ఆయా ప్రాంతాల్లో నేల రకాలను గుర్తించి.. అక్కడ పండే కూరగాయల విత్తనాలను సరఫరా చేయడంతో పాటు పంట ఉత్పత్తుల రవాణా, తగిన ధరలతో క్రయవిక్రయాలకు అవకాశం కల్పించడం, తద్వారా వినియోగదారులకు తాజా కూరగాయలను అందించడం పంట కాలనీల ఉద్దేశం. ఈ మేరకు 2016లో హైదరాబాద్‌ నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టును ఎంపిక చేశారు.

Vegetables Price hike Telangana : ఇబ్రహీంపట్నం, యాచారం, మాంచాల మండలాల్లోని 38 గ్రామాల్లో 2,780 మంది రైతులు ముందుకు రాగా.. వారికి సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందించారు. ఇతర సౌకర్యాలు కూడా వారికి కల్పించారు. ఇది రెండేళ్ల పాటు కొనసాగింది. అనంతరం ఆ సబ్సిడీలు నిలిచిపోయాయి. దీంతో రైతుల్లోనూ ఆసక్తి తగ్గింది. 2016 డిసెంబరులో ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం మరో 28 జిల్లాల్లో 111 మండలాలను గుర్తించి.. అక్కడ పంట కాలనీలను ఏర్పాటు చేయాలని భావించింది. అయితే పైలట్‌ ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో పంట కాలనీలు ప్రారంభం కాలేదు. దీంతో కూరగాయల ఉత్పత్తి పెరగకపోగా ఏటా తగ్గుతోంది. దీంతో కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

అకాల వర్షాలు.. 70 వేల ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయలకు రవాణా, ఇతర ఖర్చులు తోడవడంతో ధరలను పెంచి వాటిని విక్రయిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది మార్చి 16 తర్వాత కురిసిన అకాల వర్షాలకు 70 వేల ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. ఇది కూడా ఈ సీజన్‌లో కూరగాయల ధరల పెరుగుదలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూరగాయల సాగు పెంపుదలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇతర పంటల కంటే తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో పండే పంటలు రైతులకు లాభదాయకమని, వారికి గిట్టుబాటు ధరలను కల్పించడంతో పాటు మార్కెటింగ్, రవాణా సౌకర్యాలు సమకూరిస్తే కూరగాయల సాగు వైపు రైతాంగం మళ్లే వీలుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రవాణా ఖర్చులను భరిస్తూ పంటను మార్కెట్లకు తరలించడం, అక్కడ దళారులు చెప్పిన ధరకు ఇవ్వడం వల్ల లాభాలు దక్కడం లేదని పలువురు కూరగాయల రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు వారికి అకాల వర్షాలు శాపంగా మారుతున్నాయని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.